యువత వ్యవసాయ రంగంవైపు చూపు మరల్చేలా శాస్త్రవేత్తలు ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… స్వయంగా మంత్రి రైతు కావడం ఆనందంగా ఉంది. తన వ్యవసాయక్షేత్రాన్ని, జోగులాంబ ఆలయాన్ని త్వరలోనే సందర్శిస్తాని తెలిపారు.
అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది కీలకపాత్ర. ఇక్కడి జనాభాలో 54.6శాతం మంతి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఉన్నారు. రాష్ట్రం జనాభాలో 60శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని అన్నారు.

