telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సీటు ఇవ్వలేదని.. కుర్చీలు తీసుకెళ్లిన కాంగ్రెస్ నేత..! వాహ్ క్యా ఐడియా ..

AP Congress candidates list release shortly

ఓ కాంగ్రెస్ నేత ఎంపీ టికెట్ ను ఆశించి భంగపడ్డాడు. దానితో ముంబై గాంధీభవన్ లో ఉన్న 300 కుర్చీలూ తనవేనని, తాను వాటిని తీసుకెళ్లిపోతానని చెబుతూ, అనుచరగణంతో వచ్చి కుర్చీలన్నింటినీ తీసుకెళ్లిపోయారు. సిల్లోడ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్దుల్ సత్తార్, ఔరంగా బాద్ లోక్ సభ సీటును ఆశించగా, కాంగ్రెస్ మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న సుభాష్ జంబాద్ వైపు మొగ్గుచూపింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైన అబ్దుల్ సత్తార్, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే అనుచరులను వెంటేసుకుని గాంధీభవన్ కు వెళ్లిన ఆయన, తన డబ్బులతో తెచ్చిన కుర్చీలను ఎందుకు ఉంచాలని ప్రశ్నిస్తూ, వాటిని తీసుకెళ్లారు.

ఆ సమయంలో కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్త సమావేశం జరగనుండగా, కార్యకర్తలు కూర్చునేందుకు కుర్చీలు లేక, సమావేశాన్ని ఎన్సీపీ ఆఫీసుకు మార్చుకోవాల్సి వచ్చింది. దీనిపై అబ్దుల్ సత్తార్ స్పందిస్తూ, అవి తన కుర్చీలని, కాంగ్రెస్ సమావేశాల నిమిత్తం తెచ్చి పెట్టానని, ఇప్పుడు పార్టీని వీడినందున వెనక్కు తెచ్చుకున్నానని అన్నారు. టికెట్ లభించిన వారే పార్టీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. అబ్దుల్ సత్తార్ కు స్థానికంగా మంచి పట్టున్న నేతగా పేరుంది. సత్తార్ పార్టీని వీడటంపై జంబాద్ మాట్లాడుతూ, సత్తార్ అవసరం తమకుందని, ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని అన్నారు. ఆయనకు అవసరమై కుర్చీలు తీసుకెళ్లారేమోనని అన్నారు.

Related posts