నిమ్మగడ్డ ప్రసాద్ పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిమ్మగడ్డ ప్రసాద్ నోరు విప్పినా, విప్పకపోయినా ముప్పే ఉందన్నారు. ఆయన నోరు విప్పితే ఏపీ సీఎం జగన్ జైలుకు వెళ్తారని అన్నారు.
నిమ్మగడ్డ నోరు విప్పకపోతే ఆయనే ఉరికంబం ఎక్కుతాడని అన్నారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రం దివాలా అంచున నిలిచిందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గన మైనింగ్ వ్యవహారం విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని పేర్కొన్నారు.


ప్రాజెక్టు నిర్మాణాలను తప్పుబట్టిన కోదండరాం