telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సింగూరులో చుక్క నీరు లేదని ఆందోళన పడవద్దు: హరీశ్‌ రావు

harish rao trs

సింగూరులో చుక్క నీరు లేదని ఎవ్వరు ఆందోళన పడవద్దని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ ద్వారా నీళ్లు నింపి సాగు, తాగు నీళ్లు అందజేస్తామన్నారు. సోమవారం కల్హేరు మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని, నిజాంపేట్‌లో వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించారు.

అనంతరం హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడుతూ..వైద్యం కోసం ఇక మీదట ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. రూ. 6 కోట్లతో ఆస్పత్రిని నిర్మించామన్నారు. రెండు రోజుల్లో అదనపు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా వచ్చే పైసలు చాలా మందికి అందలేదని.. 15 రోజుల్లో రైతులకు అందజేస్తామని తెలిపారు.

Related posts