telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

అమెజాన్ : .. 4శాతం వాటాతో సరిపెట్టుకున్న .. జెఫ్ బెజోస్ భార్య మెకన్జీ…

america media blackmailing amazon ceo

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకన్జీ బెజోస్‌ల వివాహం జీవితం ఇక ముగిసిన అధ్యాయం. వారి విడాకుల వ్యహారానికి సియాటెల్ న్యాయమూర్తి ముగింపు ఇచ్చారు. ఆయన తీర్పు ప్రకారం.. విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా అమెజాన్‌లోని నాలుగు శాతం వాటా మెకన్జీకి లభించనుంది. ఈ వాటా విలువ 38.3 బిలియన్ డాలర్లు. ఈ వాటాతో మెకన్జీ అత్యంత ధనవంతురాలైన మూడో మహిళగా రికార్డులకెక్కనుంది.

బెజోస్ 114.8 బిలియన్ డాలర్ల విలువైన 12 శాతం వాటాతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా కొనసాగుతున్నాడు. తామిద్దరం విడిపోతున్నట్టు ఈ ఏడాది జనవరిలో జెఫ్ బెజోస్-మెకన్జీ బెజోస్‌లు ప్రకటించారు. విడాకులకు కోర్టు అనుమతి ఇచ్చాక ఏప్రిల్‌లోనే మెకన్జీ పేరుపై అమెజాన్‌లోని నాలుగు శాతం వాటా (19.7 మిలియన్ షేర్లు)ను రిజిస్టర్ చేశారు.

Related posts