telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ట్రంప్​ కు రాష్ట్రపతి విందు..హాజరుకానున్న కేసీఆర్​

KCR cm telangana

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఈరోజు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు విందులో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారని సమాచారం.

ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు, కూతురు ఇవాంకకు కేసీఆర్ కానుకలు అందించనున్నట్టు సమాచారం. కాగా, రాష్ట్రపతి గౌరవార్థం ఇస్తున్న ఈ విందులో మొత్తం 90 నుంచి 95 మంది వీఐపీలు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. కేసీఆర్ సహా మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, అసోం, హర్యానా, బీహార్ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయనేతలు పలువురు ప్రముఖులు ఈ విందులో పాల్గొననున్నారు.

Related posts