telugu navyamedia
తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మర్ కోచింగ్ ను విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మర్ కోచింగ్ ను విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. గురువారం సికింద్రాబాద్ మారేడ్ పల్లి ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక నరేష్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జిహెచ్ఎంసి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులో 6 సంవత్సరాల నుంి 16 సంవత్సరాల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సికింద్రాబాద్ జోన్ లోని 5 సర్కిళ్లలో 57 క్రీడలను 120 సెంటర్లలో క్యాంపు లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ క్యాంప్ లో పాల్గొనేవారు కనీస ఫీజు రూపాయలు రూ. 50/- షటిల్ బ్యాడ్మింటన్, స్కేటింగ్, క్రికెట్ ,టెన్నిస్, రోలర్ స్కేటింగ్  ఇతర గేమ్స్ కు రూ. 10 మాత్రమే చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వీటితోపాటు స్పోర్ట్స్ క్విజ్, ఇంటర్ టోర్నమెంట్స్  నిర్వహిస్తామన్నారు.
డిప్యూటీ మేయర్  శ్రీ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… ఏప్రిల్ 25 నుండి మార్చి 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిపుణుల  పర్యవేక్షణలో తమ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులకు ఆటల ద్వారా శారీరక శ్రమ, ఆరోగ్యం, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది అన్నారు. జిహెచ్ఎంసి అతి తక్కువ ఫీజుతో శిక్షణ అందిస్తుందన్నారు.1968 నుండి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ హైదరాబాదులో  ప్రారంభమయ్యాయి అని అన్నారు.
మోండా మార్కెట్ కార్పోరేటర్ దీపిక నరేష్ మాట్లాడుతూ…  జిహెచ్ఎంసి ద్వారా సమ్మర్ కోచింగ్ క్యాంప్ లలో కావాల్సిన మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. ఆటల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందన్నారు. విద్యార్థులు వేసవి కాలంలో ఆటలపైనే ఏకాగ్రత చూపించాలని టీవీ, ఫోన్లకు దూరంగా ఉండాలని తెలిపారు. యోగ, వాలీబాల్,టెన్నిస్,టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రోలర్ స్కేటింగ్, కరాటే హాకీ, జిమ్నాస్టిక్స్, ఫుట్ బాల్, క్రికెట్, బాక్సింగ్ హాకీ, థైక్వాండ్, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ కార్యక్రమంలో మొదటి స్థానం విక్కీ మాస్టర్ గోపన్న మాస్టర్, ద్వితీయ స్థానం ఆడియా నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వాలీబాల్ విజయ్, తృతీయ స్థానం కరాటే కుంగ్-ఫు చందు మాస్టర్ బేగంపేట లను డిప్యూటీ మేయర్ అభినందించారు.
ఈ సమావేశంలో కోచ్ లు K.కృష్ణ, KR విజయానంద, S కుమార్, K.P కృష్ణ, ప్రేమ్ మున్నీరు అహ్మద్, నూర్ అహ్మద్,  రాకేష్, రాజ్ కుమార్, జావిద్, మనోరంజన్, అరవింద్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts