telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్ లో హంగ్…

నిన్న విడుదలైన జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించగా, ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 స్థానాల దరికి చేరింది. చాలా స్థానాల్లో స్వల్పమెజారిటీతో అభ్యర్థులు గెలుపుసాధించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో సైలెంట్ కరెంట్ కనిపించింది. అధికార టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడుతూనే.. బీజేపీకి  ఏకంగా 49 స్థానాలు కట్టబెట్టారు. ఎవ్వరూ ఊహించని విధంగా పలుస్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది.గత ఎన్నికల్లో 99 స్థానాలు సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ .. ఇప్పుడు కేవలం 55 స్థానాలకే పరిమితమైంది. అయితే సెటిలర్స్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం టీఆర్ఎస్‌ అత్యధిక స్థానాలు సాధించింది.2016 ఎన్నికల్లో నాలుగు స్థానాలకే పరిమితమై సాధించిన బీజేపీ .. 48 స్థానాలను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఎంఐఎం పార్టీ ఓ స్థానం కోల్పోయి 44 స్థానాలు నిలబెట్టుకుంది. ఓల్డ్ సిటీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో బీజేపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈవిజయం కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమేనన్నారు బీజేపీ నేతలు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది . కేవలం రెండు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

Related posts