telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైంది : బండి

గ్రేటర్ ఫలితాల తర్వాత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… తెలంగాణలో ఇకపై ఏ ఎన్నిక జరిగినా ఇదే రకమైన ఫలితాలు వస్తాయని తెలంగాణ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి సంఖ్యలో సీట్లు రావడంతో కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్ ఫలితాలను ఉద్దేశిస్తూ..  కారుకు సన్ స్ట్రోక్ తగిలింది… కమలానికి సన్ రైజ్ కల్గిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్ర  ఎన్నికల సంఘం కమిషనర్, డీజీపీకి బీజేపీ విజయం అంకితం అన్నారు బండి సంజయ్. రాబోయే రోజుల్లో ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. ప్రజా సమస్యల మీద బీజేపీ పోరాడుతుంది, టిఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైందని బండి సంజయ్ హెచ్చరించారు. కార్యకర్తల కంటే ఎక్కువగా SEC, DGP టీఆర్ఎస్ కోసం కష్టపడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. సారు,  కారు, ఇక రారు.. 2023లో కారు షెడ్డుకు పోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అర్థరాత్రి SEC తప్పుడు సర్క్యులర్ ను విడుదల చేయటం దారుణమన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలి, గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీ సొంతం.. గడీ నుంచి సీఎం కేసీఆర్ ను బయటకు తీసుకొస్తాం..  అహంకారాన్ని నెత్తికి ఎక్కించుకోం.. హైదరాబాద్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాం.. ఆదరించిన హైద్రాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తాం.. సీట్లు మాత్రమే కాదు.. బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగాయని, జాతీయ నాయకుల ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందని తెలియజేశారు బండి సంజయ్.

Related posts