telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్-బండి సంజయ్ కి బెయిల్ నిరాకరణ

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. బండికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో పాటు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.

నిన్న రాత్రి కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా… బండి సంజయ్‌ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

జాగరణ దీక్ష చేపట్టడంతో పాటు పోలీస్ విధులను అడ్డుకోవడంతో బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

Related posts