నేడు వరల్డ్ కప్ క్రికెట్ కోసం 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించనున్న నేపథ్యంలో, ఎవరికి స్థానం లభిస్తుందన్న అంశంపై అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన డ్రీమ్ టీమ్ ను ప్రకటించాడు.
ఈ టీమ్ లో ధోనీ పేరు లేకపోవడం గమనార్హం. గంభీర్ తన జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్, కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ ను సాధించిన సంగతి తెలిసిందే. నాటి జట్టులో గౌతమ్ గంభీర్ కూడా సభ్యుడే.
సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్.. కామెంటరీ ప్యానల్ లో దక్కని స్థానం!