telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

షాకింగ్ : మళ్లీ పెరిగిన పసిడి ధర..

gold-biscuits hyd

పసిడి ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ స్వల్పనగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.182 పెరిగి రూ. 51,740 కు పలుకుతోంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.213 పెరిగి రూ. 50,760కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగి రూ.47,100 కు పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 805 పెరిగి రూ. 63,714 కు చేరింది. నిన్న ట్రేడ్ లో కిలో వెండి ధర రూ. 61,374 వద్ద ముగిసింది. హైదరాబాద్ కిలో వెండి ధర రూ.1075 పెరిగి రూ. 62,751 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోవడంతో దేశీయంగా పసిడి ధరలు పెరగడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు. పండగ సమయంలో ఈ హెచ్చు తగ్గుళ్లు సాధారణమే అని నిపుణులు అంటున్నారు. 

Related posts