telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ లో .. ఫేవరేట్ గా ఉన్న టీం ఇండియా.. కప్పు తెచ్చేనా..

265 is target to india on srilanka

టీమిండియా ఈ టోర్నీ లీగ్ దశలో ఓడింది కేవలం ఒక్క మ్యాచ్‌లోనే. అది కూడా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపైనే. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. ఇంగ్లండ్‌కు గట్టిపోటీనే ఇచ్చింది. ఇక మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ అన్ని జట్లపై భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అన్ని జట్ల కన్నా భారత జట్టు ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన భారత్ 7 మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసింది. ఒక మ్యాచ్‌లో ఓటమి పాలు కాగా, మరొక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. భారత్ 15 పాయిట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముందు వరకు టీమిండియా ఖాతాలో ఒక్క ఓటమి కూడా నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే చాలు.. భారత్ వరల్డ్ కప్ టైటిల్‌కు ఎంత ఫేవరెటో ఇట్టే అర్థమవుతుంది.

మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో భారత్ పోరాటం ఖాయం అయిపోయింది. ఈ మొదటి సెమీ ఫైనల్‌లో టీమిండియా సత్తా చాటితే;. 2011 సీన్ రిపీట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో విజయం సఫారీలనే వరించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఆసీస్ 2వ స్థానంతో సరిపెట్టుకోగా.. ఆ జట్టు ఈ నెల 11వ తేదీన బ‌ర్మింగ్ హామ్‌లో ఇంగ్లండ్‌తో 2వ సెమీ ఫైనల్‌లో తలపడనుంది. ఇక పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన భారత్ ఈ నెల 9వ తేదీన మాంచెస్టర్‌లో మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడనుంది.

Related posts