telugu navyamedia
క్రైమ్ వార్తలు

చిల్డ్రన్స్ ఐసీయూలో మంటలు…

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ప్రత్యేక వార్డు (SNCU)లో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు శిశువులు మరణించారు.

ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉండ‌గా..వారిలో 36 మందిని మరొక వార్డుకు త‌ర‌లించ‌డంతో  చిన్నారులు ప్రాణాలతో సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఐసీయూ ఉన్న ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య విద్యాశాఖ విశ్వాస్‌ సారంగ్‌ అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఒక్కొక్కరికి ఇవ్వనున్నట్లుమంత్రి విశ్వాస్‌ సారంగ్‌ తెలిపారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా..ఈ విషాద సంఘటన పై పిల్లల వార్డులో అగ్నిప్రమాదం సంభవించడం చాలా బాధాకరమని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. పిల్లలంతా క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఈ మొత్తం ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి కమల్‌నాథ్ అన్నారు..

Related posts