telugu navyamedia
రాజకీయ

ఈ నెల 29 నుంచి పార్లమెంట్ స‌మావేశాలు..

ఢిల్లీ : ఈ నెల 29 నుంచి డిసెం బరు 23 వరకు శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ నేతృత్వంలో కేబినెట్ క‌మిటీ సిఫార్సు మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కొవిడ్ ప్రొటోకా లను పాటిస్తూ సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. కొవిడ్ మహమ్మారి ప్రభా వంతో గతేడాది శీతాకాల సమావేశాలు జ‌ర‌గ‌లేదు. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలను కుదించారు.

ఈ దఫా పార్ల మెంటు ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ సహా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేప థ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం, పెరు గుతున్న ఇంధన, వంటనూనె ధరలు, కశ్మీ ర్‌లో సాధారణ పౌరులపై దాడులు, లఖిం పుర్ హింస, వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా రైతులు చేస్తున్న ఆందోళన తదితర అంశాలపై విపక్షాలు.. ప్రభుత్వాన్ని నిల‌దీసే అవ‌కాశాలు ఉన్నాయి.

Related posts