telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం !

Ongc blast fire

హైదరాబాద్ మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి కేపీహెచ్ బి కాలనీలోని ఓ హార్డ్ వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. రాందేవ్ ఎలక్ట్రికల్ అనే హార్డ్ వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నాయి. మంటలు చెలరేగిన షొప్ కిందనే సీఎంఆర్ జ్యూవెలరీ షాప్ ఉండటంతో భారీగా ఆస్తి నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పక్కనే ఉన్న బట్టల షో రూంలు, ఇంకో పక్కన జోయాలుక్కాస్ బంగారం షో రూమ్ ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కాగా.. అబిడ్స్‌లోని గన్‌ ఫౌండ్రీలో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొదట ఓ హోటల్‌ కిచెన్‌లో చెలరేగిన మంటలు..పక్కనే ఉన్న ఓ చెప్పుల గొడౌన్‌కు వ్యాపించాయి. గోడెన్‌లోని చెప్పులు, హోటల్‌లోని ఫర్నీచర్‌ అగ్నికి దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts