telugu navyamedia
సినిమా వార్తలు

“దసరాబుల్లోడు” అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ 

నిర్మాత , దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ , అక్కినేని నాగేశ్వర రావు , వాణిశ్రీ తో రూపొందించిన “దసరా బుల్లోడు “
సినిమా ఈరోజుతో 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంది . 1971 జనవరి 11న ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది . 
జగపతి ఆర్ట్స్ బేనర్ మీద నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్ర ప్రసాద్ గారు మొదటిసారి దర్శకత్వం వహించారు . నిజానికి ఈ సినిమాకు ముందు వీరమాచ నేని  మధుసూదన రావు గారిని అనుకున్నారు . కానీ ఆయన వేరే సినిమాలతో బిజీ గా ఉండటంతో అక్కినేని నాగేశ్వర రావు గారిని దర్శకత్వం వహించమని రాజేంద్ర ప్రసాద్ గారు కోరారు . కానీ నాగేశ్వర రావు గారు ప్రసాద్ గారినే దర్శకత్వం వహించామన్నారు . అలా నాగేశ్వర రావు గారి  బలవతం మీద వీరమాచినేని రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకుడయ్యారు . ఈ సినిమాకు కథను అందించింది రాజేంద్ర ప్రసాద్ గారే . అందుకే నాగేశ్వర రావు గారు రాజేంద్ర ప్రసాద్ గారినే దర్శకత్వం వహించామన్నారు . ఈ సినిమాలో చంద్ర కళ , ఎస్ .వి .రంగారావు , గుమ్మడి , నాగభూషణం , పద్మనాభం , అంజలి దేవి , సూర్యకాంతం  మొదలైన వారు నటించారు . ఇక పాటల విషయానికి వస్తే ” పచ్చగడ్డి కోసేటి  పడుచుపిల్ల .. నీ పైట జారిందే గడుచుపిల్ల “, ” ఎట్టాగో ఉన్నాది ఓలమ్మో .. “, “నల్లవాడే అల్లరి పిల్లవాడే “, ” చేతిలో చెయ్యేసి చెప్పు బావా “, ” ఓ మల్లయ్యగారి … ” పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి . కుర్రకారును ఓ ఊపు ఊపేశాయి . 
అప్పట్లో “దసరా బుల్లోడు ” సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది . ఈ సినిమాకు మాటలతో పాటు పాటలను కూడా ఆచార్య ఆత్రేయ రచించారు . మహదేవన్  సంగీతం సమకూర్చారు . పాటలన్నీ విశేష ప్రజాదరణ పొందాయి . “దసరా బుల్లోడు ” అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది . అక్కినేని నాగేశ్వర రావు 
ఈ చిత్రం లో చేసిన డాన్సులు కుర్రకారును బాగా ఆకట్టుకున్నాయి . 
అందరు ఇష్టపడే ఈ సినిమా టైటిల్  “దసరా బుల్లోడు ” పేరుతో  రాజేంద్ర ప్రసాద్ గారి జీవిత్ర చరిత్రను నేను రచించాను . ఆ రకంగా దసరా  బుల్లోడు తో నాకు అనుబంధం వుంది . నిర్మాత, దర్శకుడు వీబీ  రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి సంస్థ పై ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు తెలుగు , హిందీ భాషల్లో నిర్మించారు . 
చిత్ర నిర్మాణం తరువాత ఆయన ఫిలిం నగర్ గృహ నిర్మాణ సంస్థ కు అధ్యక్షులుగా ఉండి , ఫిలిం నగర్ కాలనీ ని అభివృద్ధి చేశారు . అలాగే ఫిలిం నగర్ లో 
“ఫిలిం నగర్ దైవ సన్నిధానం ” పేరుతో ఏర్పాటు చేసిన దేవాలయం ఆయన స్మృతి ని గుర్తుచేస్తూ ఉంటుంది . రాజేంద్ర ప్రసాద్ గారు  మంచి మనిషి , మావతా వాది . 
– భగీరథ 

Related posts