టీమిండియా ఆల్ రౌండర్, మాజీ బాయ్‌ఫ్రెండ్ హార్దిక్ పాండ్యాను బాలీవుడ్ నటి ఎల్లీ అవ్‌రామ్ పెళ్లాడబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆమె స్పష్టత ఇచ్చింది. పాండ్యాను తాను పెళ్లాడబోవడం లేదని, పెళ్లి వార్తలపై వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, అటువంటి వార్తలు సిగ్గుచేటని తీవ్రస్థాయిలో స్పందించారు. ఏది ఏమైనా పాండ్యాతో పరిచయం చాలా క్రితమే ముగిసిందని, పనిచేసేందుకే తాను ఇక్కడకు వచ్చానని, ఇటువంటి అగౌరవప్రదమైన ప్రచారాన్ని తాను కోరుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. గతేడాది హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా వివాహంలో ఈ స్వీడన్ చిన్నది హార్దిక్‌తో కలిసి హల్‌చల్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లాడబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ దూరం అయ్యారు. తాజాగా మరోమారు వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నట్టు వార్తలు రావడంపై అవ్‌రామ్ ఫైర్ అయ్యారు.
previous post
విజయ్ దేవరకొండతో లిప్ లాక్… స్పందించిన రష్మిక