telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ లో ఆమెది విలన్ పాత్రా…?

రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ను పాన్‌ ఇండియా మూవీగా భావించడంలేదు. పాన్‌ ఇంటర్నేషనల్‌గా చూస్తున్నాడు.అయితే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఎన్టీఆర్‌ పక్కన ఫారిన్‌ బ్యూటీ ఒలీవియా మోరిస్‌ను ఎంచుకున్నాడు. ఇంకా ఈ అమ్మడు సెట్స్‌లోకి అడుగుపెట్టకుండానే.. ఐరిష్‌ నటి అలిసన్‌ డ్యూడీ షూటింగ్‌లో జాయిన్‌ అయింది. ఈ అమ్మడు సినిమాలో లేడీ స్కాట్‌ పాత్రలో కనిపించనుంది. బ్రిటీష్‌ సంస్థానంలో అధికారిణిగా కనిపించనుందని.. విలన్‌ తరహాగా ఆమె పాత్ర వుంటుందని టాక్‌. అయితే షూటింగ్ పాల్గొనడానికి అలిసన్ డూడి ఇండియాకు వచ్చింది. ఈ విషయాన్నిచెబుతూ చిన్నపాటి వీడియోను పోస్ట్ చేశారు. ఒలీవియా మోరిస్‌..అలిసన్‌ డూడీతోపాటు..ఫారిన్‌ యాక్టర్స్‌ కూడా ఇందులో నటించారట. రాజమౌళి సినిమాలో ఇలా ఫారిన్‌ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించడం ఇదే ఫస్ట్ టైం. ఇక రామ్‌చరణ్‌ హీరోయిన్‌గా అలియాభట్‌ నటిస్తోంది. ఆమె ఈ నెల మొదటివారం నుంచి షూటింగ్‌లో పాల్గొనాల్సి వుండగా.. ఫారిన్‌ యాక్టర్స్‌ రాకతో ఆమె షెడ్యూల్‌ మారిందని సమాచారం. అలియా ఆర్‌ఆర్‌ఆర్‌ టీంలో డిసెంబర్‌లో వచ్చి చేరనున్నట్లు తెలుస్తుంది.

Related posts