telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ విమర్శలపై స్పందించిన అమిత్ షా

amith shah bjp

భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆయనకు తన సమాధానం ఇదేనంటూ అమిత్ షా, తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ లో ఓ సైనికుడి తండ్రి మాట్లాడారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు తేవద్దని ఆయన కోరారు. ఓ ధీశాలి అయిన ఆర్మీ మ్యాన్ తండ్రి రాహుల్ గాంధీకి చాలా స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు.

దేశమంతా ఏకతాటిపై ఉన్న వేళ, రాహుల్ గాంధీ కూడా తుచ్ఛమైన రాజకీయాలు పక్కనబెట్టి, జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి” అని ఆయన ట్వీట్ చేశారు.లడఖ్ లో నెలకొన్న పరిస్థితులపై నిత్యమూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం కూడా ఆయన ఓ ట్వీట్ చేస్తూ, “భారత భూ భాగాన్ని ప్రధాని చైనాకు సరెండర్ చేశారని రాహుల్ వ్యాఖ్యానించారు.

Related posts