telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశ భ‌ద్ర‌త గురించి చర్చించాలి: ‌చిదంబ‌రం

congress chidambaram

లడఖ్‌లోని గా‌ల్వన్ లోయ వద్ద భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం స్పందించారు. భారత్‌లో చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించ‌డం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాద‌ని చెప్పారు. చెప్పారు. చైనా వస్తువుల బహిష్కరణ వంటి ‌చిన్న విషయాలను లేవ‌నెత్తి స‌మ‌యాన్ని వృథా చేయొద్దని అన్నారు. దేశ భ‌ద్ర‌త గురించి చర్చించాలని ఆయన పేర్కొన్నారు.

చైనా వస్తువుల బహిష్కరణ వంటి ‌చిన్న విషయాలను లేవ‌నెత్తి స‌మ‌యాన్ని వృథా చేయొద్దని అన్నారు. దేశ భ‌ద్ర‌త గురించి చర్చించాలని చెప్పారు. భారత్‌లో త‌ప్ప‌కుండా స్వ‌యం స‌మృద్ధి సాధించాల‌ని అన్నారు. ఇత‌ర దేశాలతో సంబంధాలు తెగిపోకుండా చూసుకోవాల‌ని హితవు పలికారు. చైనా ఉత్ప‌త్తుల‌ను దేశంలో బ‌హిష్క‌రించ‌కుండా మనం గ్లోబ‌ల్ స‌ప్ల‌య్‌ చెయిన్‌లో భాగ‌స్వామిగా కొనసాగాలని తెలిపారు. చైనాకు ప్రపంచంతో ఉన్న వాణిజ్య సంబంధాలతో పోల్చి చూస్తే ఆ దేశానికి భార‌త్‌తో వాణిజ్యం ఏపాటిద‌ని చిదంబరం నిలదీశారు

Related posts