telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : .. మద్యపాన నిషేధం ఒకవైపు .. డీఅడిక్షన్ సెంటర్లు..

AP

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ విషయంలో మరో ముందడుగు పడనుంది. ఏపీలో డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నారు. డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుతో పాటు కల్తీ మద్యం తయారు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే మద్యపానం వల్ల ఎలాంటి అనారోగ్యాలు, అనర్థాలు వస్తాయనే అంశాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా చేర్చాలని అధికారులను సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి సంబంధించి జగన్ ప్రకటన చేసిన తరువాతే లిక్కర్ సేల్స్ తగ్గాయని వారు వెల్లడించారు. 2018-19 ఏడాదిలో 125లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయని.. అయితే ఈ ఏడాది జూలై వరకు వాటితో పోలిస్తే 12లక్షల కేసులు తగ్గాయని సీఎం జరిపిన సమీక్షలో అధికారులు ఆయనకు వెల్లడించారు. మరోవైపు లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఇటీవలే అసెంబ్లీలో కొత్త మద్యం పాలసీకి కూడా ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో ప్రభుత్వం 503 మద్యం దుకాణాలను తెరవనుంది. ప్రస్తుతం ఉన్న 4380 మద్యం షాపులను 3500కు తగ్గించనుంది.

Related posts