telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

శబరిమలలో.. దారుణం.. మహిళలకు దర్శనం చేయించిన అధికారులు.. బోరుమంటున్న భక్తులు..

women got succeeded in sabarimala issue

శబరిమల అయ్యప్ప దర్శనం ఏ వయసువారైనా చేయవచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చిందని, అప్పటి నుండి మహిళలు స్వామి దర్శనానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భక్తుల నిరసనలతో ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు. అధికారులు కూడా భక్తులను కాదని ఏమి చేయలేకపోయారు. అయితే తాజాగా అధికారులు సమయం చూసుకొని ఇద్దరి మహిళలకు స్వామి దర్శనం చేయించినట్టు తెలుస్తుంది. దీనితో అపచారం జరిగిపోయిందని, కుమిలిపోతున్నారు భక్తులు. వివరాలలోకి వెళితే, కేరళ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంది. శబరిమలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయ్యప్ప దేవాలయానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు ఈ తెల్లవారుజామున స్వామిని దర్శించుకున్నారు. మండల పూజలు ముగిసి, మకరవిళక్కు పూజల కోసం స్వామి ఆలయాన్ని తెరచిన వేళ, మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఇంకా సమయం ఉండగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, పోలీసులు భారీ భద్రత మధ్య 40లోపు వయసున్న ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం చేయించారు. వారు ఆలయానికి సమీపంలోకి వచ్చిన తరువాత, భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారు.

బిందు, కనకదుర్గ అనే మహిళలు స్వామిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. మహిళల దర్శనం పై తాజాగా కోర్టు వెలువరించిన తీర్పుపై కౌంటర్ దాఖలు చేసిన ఆలయ కమిటీకి ఇంకా వారి పిటీషన్ వాదనకు రాకముందే, ఆలయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి పనులన్నీ దేశంలో మతకల్లోలాలు రేపెవారి పని అని, దానిని తిప్పి కొట్టకుండా, అందరూ ఆ చదరంగంలో పావులైపోవటం, ఇంత చదువుకున్నా విజ్ఞత కోల్పోవడం సరికాదని అన్నారు.

Related posts