telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

139 రేప్ కేసు ఆధారంగా వర్మ సినిమా.. ?

RGV

పలువురు రాజకీయ నాయకులు, ఫిలిం సెలబ్రెటీలు, మరికొందరు కలిసి మొత్తం 139 మంది తనను అత్యాచారం చేశారంటూ ఇటీవల ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆదారంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తన టీమ్ ను పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పంపారని, త్వరలోనే సినిమా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం మిర్యాలగూడ పరువు హత్య నేపథ్యంలో వర్మ సినిమా తెరకెక్కస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా 139 మంది అత్యాచారం ఆరోపణల్లో ఇద్దరు సెలబ్రిటీల పేర్లు కూడా వెల్లడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఆ ఇద్దరు బయటకు వచ్చి ఆ వార్తలను ఖండించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్లేట్ మార్చి సెలబ్రిటీలకు సంబంధం లేదని డాలర్ బాయ్ అనే వ్యక్తి బెదిరించి అలా చెప్పించాడని మీడియా ముందు తెలిపింది. తనపై కొందరు అత్యాచారం చేసిన విషయం మాత్రం నిజం అని బాధితురాలు పోలీసులకు పేర్లతో సహా అందించింది. కొన్ని ఆధారాలు కూడా అందచేసింది. నిజాలు తేల్చేందుకు పోలీసులు రంగంలో దిగారు.

Related posts