కొరటాల శివ దర్శకత్వంలో నటుడు చిరంజీవి హీరోగా స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి 152వ చిత్రమది. `ఖైదీ నంబర్ 150`, `సైరా నరసింహారెడ్డి` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా.. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా… చిరంజీవి కోసం ప్రొడక్షన్ డిజైనర్ సురేశ్ సెల్వరాజన్ కొత్త ఇంటిని సిద్ధం చేస్తున్నారు. అలాగే, ఓ కాలనీని సృష్టించారు. ఈ ఇల్లు, కాలనీ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసమే! చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ డిసెంబర్‌లో మొదలు కానుందని సమాచారం. ప్రస్తుతం కోకాపేట్‌లోని చిరంజీవి సొంత స్థలంలో ఇల్లు, కాలనీ సెట్స్ వేస్తున్నారు. హీరోయిన్ హౌస్ సెట్ కూడా అక్కడే వేసి, మెజారిటీ సన్నివేశాలను ఆ సెట్స్‌లో తెరకెక్కిస్తారట! అలాగే, రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత భాగం చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుకు చోటుందని, త్వరలో వారిని ఎంపిక చేయనున్నారని తెలిసింది. చిరంజీవి నుండి అభిమానులు ఆశించే అంశాలు, వాణిజ్య హంగులతో పాటు మంచి సందేశం కల కథను కొరటాల సిద్ధం చేశారట! ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ‘సైరా నరసింహారెడ్డి’లో కొన్ని సన్నివేశాలనూ కోకాపేట్ సెట్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.