హైద్రాబాద్ శివారు పటాన్ చెరు పారిశ్రామిక వాడాలోని నిత్య లేబరటరీస్ కంపెనీలో పని చేసే కార్మికులు జీతాల కోసం రోద్దేక్కారు. గత 8 సమత్సరాల నుంచి పనిచేస్తున్న తమకు ఇంత వరకు సరిగ్గా జీతాలు ఇవ్వడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఆదివారం కంపెనీ గేట్ ముందు టెంట్ వేసుకొని ధర్నా చేపట్టారు.
కంపెనీ యాజమాన్యం ఒక్కొక్కరికి 1లక్ష నుండి 4లక్షల రూపాయల వరకు, 100 మంది కార్మికులకు సుమారు 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పెండింగ్ జీతాలు చెల్లించకుండా, కార్మికులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండ. లాకౌట్ చేసుకొని వేరే యాజమాన్యానికి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. న్యాయ పరంగా మాకు వచ్చే డబ్బులు మాకు ఇచ్చిన తర్వాతనే కంపెనీని నడిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకపోతే తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని యాజమాన్యాన్ని కార్మికులు. హెచ్చరించారు.
సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్.. కామెంటరీ ప్యానల్ లో దక్కని స్థానం!