telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రచారంలో.. గొంతుక సాయం..

sirisilla announcers in campaign

‘చిన్నా.. అంటే.. నేనున్న అన్నా అని వచ్చే నాయకుడు.. మన ఆకుల చిన్న.. ఓటరు మహాశయులారా.. మీ అమూల్యమైన ఓటును మన ఆకుల చిన్న గుర్తుకు వేయండి..ఒక్క నాటి పొరపాటు.. కాకూడదు ఐదేళ్ల గ్రహపాటు.. ఆలోచించండి.. మీ ఓటును.. అభ్యర్థికి వేయండి” అంటూ వినిపించే గొంతుకలు అవి. ‘బడుగు బలహీన వర్గాల నేత మన స్థానికుడు. ఏ రాత్రి పిలిచినా నేనున్నానని పరుగెత్తుకొచ్చే నిస్వార్థ ప్రజాసేవకుడు మన అన్న’.. అంటూ అభ్యర్థి పక్షాన ప్రచారం. ‘వట్టి మాటలు కట్టిపెట్టండి.. మన ప్రాంతానికి గట్టిమేలు తలపెట్టే నేతను ఎన్నుకోండి. మాయమాటలతో వచ్చేవాళ్ల మాటలు నమ్మకండి.. సమస్యల సుడిగుండంలో ఉన్న మన వార్డులో అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటేద్దాం. వాగ్ధానాలను నమ్మకండి.. మాట మీద ఉండి మనకు సేవ చేసే వ్యక్తులకే ఓట్లు వేయండి.. నోటుకు ఓట్లు అమ్ముకోకండి’.. అంటూ ఓటర్లను అప్రమత్తం చేసే ఆ గొంతుకలు సిరిసిల్లవి. నాలుగు దశాబ్దాలుగా ప్రచార రంగంలో వినిపిస్తున్న సిరిసిల్ల స్వరాలివి. వాణిజ్య ప్రకటనలే కాదు.. ఎన్నికల ప్రచార పర్వంలో ఆ గొంతులకు ప్రత్యేక స్థానం. పాటలు మధ్యమధ్యలో మాటల తూటాలు. ప్రజలకు స్పష్టంగా గుండెలకు హత్తుకునేలా, అర్థమయ్యేలా చెప్పడమే కాదు ఒక్క క్షణం ఆలోచింపజేసే మాటల తూటాలు పేల్చే మాటల మాంత్రికులు వాళ్లు. పార్టీ ఏదైనా ఎజెండాలు ఏవైనా ప్రచారం చేసే గొంతుకలు అవి.

సిరిసిల్ల జిల్లా కేంద్రంగా అనౌన్సర్లుగా రాణిస్తున్నారు. 1974లో పద్నాలుగేళ్ల ప్రాయంలో మొదటిసారిగా అనౌన్సర్‌ అయ్యాను. అప్పట్నుంచి వివిధ వ్యాపార, వాణిజ్య ప్రకటనలకు వ్యాఖ్యాతగా పని చేస్తున్న. ఎన్నికల సీజన్‌లో తీరిక లేకుండా ప్రచార ప్రకటనలు వస్తాయి. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల నుంచి చాలా మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇచ్చి మరీ రికార్డింగ్‌లు అడుతున్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తూ రికార్డ్‌ చేస్తా. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా 155 మందికి ప్రచార ప్రకటనలు చేసిన. ఒక్కో దానికి సమయాన్ని బట్టి.. వాళ్ల డిమాండ్‌ను బట్టి డబ్బులు తీసుకుంటాం. అంతా ఆన్‌లైన్‌లోనే వ్యాపారం సాగుతుంది.

Related posts