telugu navyamedia
రాజకీయ

తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు తో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది

హైదరాబాద్‌ తెలంగాణ లో మేడ్చల్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి, జనగామ, జగిత్యాల,  వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఇవాళ ఉదయం 8.30గంటల వరకు మెదక్‌ జిల్లా పాపన్నపేటలో అత్యధికంగా 87.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లో 55 మిల్లీ మీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో 51.4, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో 49.2, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 46.4 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయిందని వాతావరణ శాఖ వివరించింది.

అటు ఆంధ్రప్రదేశ్ చూస్తే .. యానాంలలో ప్రధానంగా నైరుతి గాలులు వీస్తున్నాయి. దక్షిణ తమిళనాడు తీరం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజులలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావారణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి.

Kerala rain: Monsoon hits Kerala, several parts receive heavy rains; red  alert in Kozhikode | India News - Times of India

ఉత్తర కోస్తా ఆంధ్ర..

యానాం ..
ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ..
ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ..
ఈ రోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, కడప జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Related posts