telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్”లో సముద్రఖని… రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Samudrakhani

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లకు జోడీగా ఒలివియా మోరిస్ మరియు ఆలియా భట్ లు నటిస్తున్నారు ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. “ఆర్ఆర్ఆర్”లో ప్రముఖ నటుడు సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సముద్రఖనికి మంచి గుర్తింపు ఉంది. అందుకే సముద్రఖనికి రాజమౌళి కీలక పాత్ర ఇచ్చాడట. `ఆర్ఆర్ఆర్`కు సముద్రఖని పెద్ద సంఖ్యలో డేట్లు కేటాయించాడట. ఈ సినిమా కోసం సముద్రఖని దాదాపు రెండు కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నట్టు సమాచారం. దర్శకుడిగానే కాదు.. నటుడిగా కూడా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సముద్రఖని. `రఘువరన్ బీటెక్`, `అల వైకుంఠపురములో..` వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.

Related posts