telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వేలంలో .. భారీ రేటు పలికిన .. హిట్లర్ టోపీ ..

hitler things got best price in auction

మూర్కత్వనికి మానవ రూపంగా చెప్పుకొనే హిట్లర్ చనిపోయి 74 సంవత్సరాలు అవుతుంది. అతగాడికి సంబంధించిన వస్తువులు మ్యూనిచ్‌ అనే మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. ఒక ఏడాది క్రితం అడాల్ఫ్ హిట్లర్ ఐదేళ్ళ పాప ‘రోసా బెర్నిల్ నీనావ్’ తో దిగిన ఫోటో ని ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకు అమెరికాలో వేలం పాడారు. అది కేవలం ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినప్పటికీ అంత ధరకు అమ్ముడు పోవడం గమనార్హం. ఎప్పుడు క్రూరంగా ఉండే అడాల్ఫ్ హిట్లర్….. ఈ ఫోటోలో ఉన్న ఐదు ఏళ్ల అమ్మాయితో…. ఎంతో చనువుగా నవ్వుతూ ఉండేవాడు. అందువల్ల ఈ అరుదైన ఫోటో కి అంత రేటు పలికింది అని చెప్తారు.

తాజాగా హిట్లర్ కు సంబంధించిన మరొక వస్తువు ఆన్‌లైన్‌ వేలంపాటలో అమ్ముడుపోయింది. అదేంటంటే… హిట్లర్ ఎప్పుడూ ధరించే ఒక టోపీ. ఈ టోపీని దక్కించుకోవడానికి కొన్ని వేల మంది అనేక దేశాల నుంచి ప్రయత్నించారు. కానీ ఎట్టకేలకు స్విట్జర్లాండ్‌కు చెందిన అబ్దుల్లా చతీలా అనే వ్యాపారవేత్త హిట్లర్‌ ధరించిన టోపీని వేలంలో 50 వేల యూరోలకు (సుమారు రూ.40లక్షలు) దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో హిట్లర్ కి సంబంధించిన ఇతర వస్తువులు కూడా అమ్మబడ్డాయి. అయితే హిట్లర్ రాసిన ‘మెయిన్ కంప్ఫ్’ తెలుగులో ‘నా పోరాటం’ అనే పుస్తకం యొక్క డీలక్స్ కాపీ 130,000( రూ. 1 కోటి) యూరోలకు అమ్ముడుపోయిందని సమాచారం. జర్మన్ భాషలో 1925లో హిట్లర్ రాసిన ఈ పుస్తకంలో తన చరిత్ర, ఇంకా అతని హత్యల అలవాట్ల గురించి ఉంటాయి. నాజీ వస్తువులను పొందడానికి ఇతరులు బారీ మొత్తంలోనే సమర్పించుకున్నట్లు తెలుస్తుంది.

Related posts