telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నిక : టాప్‌ గేర్‌ లో వెళుతున్న ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. హోరా హోరా సాగిన ఈ ఎన్నిక ఫలితం తుది దశకు వచ్చింది. అయితే…తొలి ఫలితాల్లో ట్రంప్ ముందంజ ఉన్నట్టుగా సమచారం అందుతోంది  ఇప్పటికే ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ లో డోనాల్డ్‌ ట్రంప్ గెలుపు ఖరారైంది. అటు ట్రంప్ ప్రత్యర్థి బైడెన్ వెర్మాంట్, మస్సూచుసెట్స్, న్యూజెర్సీ, మేరీలాండ్‌లో విజయం సాధించారు. విర్జీనియా, సౌత్ కరోలినాలో ట్రంప్ ముందంజ ఉండగా…టెక్సాస్, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంప్‌ షైర్‌ లో బైడెన్ ముందంజ లో ఉన్నారు. ఇక పాపులర్, ఎలక్ట్రోరల్ ఓట్లలో ట్రంప్ ముందంజ ఉండగా… ట్రంప్‌తో సమానంగా బైడెన్ దూసుకువస్తున్నారు. ఇప్పటివరకు ట్రంప్‌కు 50.2 శాతం ఓటింగ్ రాగా.. బైడెన్‌ కు 49.7 శాతం ఓటింగ్ వచ్చింది. ఇది ఇలా ఉండగా… దిగ‌్గజ సర్వే సంస్థలు సైతం డోనాల్డ్ ట్రంప్‌ విజయం సాధిస్తారని చెబుతున్నాయి. అయితే.. తుది ఫలితం వచ్చే వరకు చూడాలి.  ఈ ఫలితం తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి.  

Related posts