telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ధోనీ రిటైర్మెంట్ వాయిదా వెనుక.. కోహ్లీ..

kohli on 2019 world cup team

ప్రపంచకప్‌లో అనంతరం ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం బాగా జరిగింది. సెమీస్‌లో కోహ్లీసేన పరాజయం పాలవ్వగానే అతడి భవితవ్యంపై సందేహాలు మొదలయ్యాయి. అయితే ధోనీ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉండటంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. జట్టులో అతడి పాత్ర ఏంటన్న దానిపై సెలక్టర్లు విశ్లేషించాలని మాజీలు సూచించారు. రిటైర్మెంట్‌ విషయంలో ధోని వెనుకడుగు వేయడానికి కారణం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినేనని తాజా సమాచారాన్ని బట్టి తెలస్తోంది.

2020లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు జట్టుకు అందుబాటులో ఉండాలని విరాట్‌ కోరినట్టు సమాచారం. రిషభ్‌పంత్‌ తొలి ప్రాధాన్య కీపర్‌గా జట్టులో ఉంటాడు. అతడికి ఇబ్బందులు తలెత్తి విశ్రాంతి అవసరమైతే మరొక మంచి కీపర్‌ ఎవరూ ఉండరన్నది కోహ్లీ ఆలోచనగా తెలుస్తోంది. మహీ అయితే వెంటనే ఆ కొరత తీరుస్తాడని అతడి ఉద్దేశమట. పంత్‌ ఎదిగేందుకు అవసరమైన సాయం ధోనీ చేస్తాడని టీమిండియా యాజమాన్యమూ భావిస్తోందట. ఇంటర్నెట్‌లో ఇందుకు సంబంధించిన వార్తలు షికారు చేస్తున్నాయి. ఏకారణం అయితేనేమి ధోనీ రిటైర్మెంట్ వాయిదా పడటంతో, అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Related posts