దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవరస్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్ర ఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. ఇటీవల చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయపడడంతో కొద్ది రోజుల పాటు చిత్రీకరణకి బ్రేక్ ఇచ్చిన టీం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక కొమురం భీం పాత్ర కోసం ఎన్టీఆర్ భారీ కసరత్తులు చేస్తున్నాడు. లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కొన్నాళ్లుగా వర్కవుట్స్ చేస్తున్నాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన చరణ్‌కి తండ్రిగా కనిపించనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్ దేవగణ్ పాత్ర ఉంటుందని సమాచారం. జూలై 30, 2020న చిత్రం విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోల పరిచయ సన్నివేశాలకు, ఇంటర్వెల్ సన్నివేశం కోసం దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. హీరోల పరిచయ సన్నివేశాల కోసం ఏకంగా అరవై కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట. అలాగే ఇంటర్వెల్ సన్నివేశాన్ని 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారట.