మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2020లో లీగ్ దశను విజయవంతంగా అధిగమించింది. ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టుగా నిలిచే ప్రయత్నంలో చెలరేగిన జట్టు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పొలార్డ్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..సూర్యకుమార్ 36, ఇషాన్ కిషన్ 33 పరుగులతో రాణించారు. సందీప్ శర్మకు 3 వికెట్లు దక్కగా, షాబాద్ నదీమ్ 2/19 పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం హైదరాబాద్ 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 85 పరుగులు, వృద్ధిమాన్ సహా 45 బంతుల్లో 58 పరుగులు చేసి ఇద్దరు నాటౌట్ గా నిలిచారు. ఇక ఈ విజయంతో ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్ శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో బెంగళూరుతో తలపడనుంది. ఇందులో ఓడి పోయిన టీం ఇంటి దారి పట్టక తప్పదు.