telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ పాలనతో తెలంగాణ అతలాకుతలం: మాణికం ఠాగూర్

Manikam Tagore Congress

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి వ్యక్తికి మేలు జరగాలనే ఉద్దేశంతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. అయితే ఆమె కోరిక నెరవేరలేదని ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ అతలాకుతలం అయిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారం మొత్తం కేసీఆర్, ఆయన కొడుకు, కుమార్తె, అల్లుడి చేతిలోనే ఉందని విమర్శించారు. ఏమీ లేని స్థితి నుంచి కేసీఆర్ వచ్చారని దుయ్యబట్టారు. పదవిని అడ్డు పెట్టుకుని ఇప్పటికే అత్యంత ధనికుడు అయ్యారని చెప్పారు. రానున్న రోజుల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని కూడా మించిపోతారని అన్నారు.

Related posts