telugu navyamedia
క్రైమ్ వార్తలు

మ‌హారాష్ర్ట మంత్రి న‌వాబ్ మాలిక్ అరెస్ట్‌..

*’దావూద్​’ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ అరెస్ట్..
*ఏడుగంట‌లు విచార‌ణ త‌రువాత అదుపులోకి తీసుకున్న ఈడీ..
*దావూడ్ ఇబ్ర‌హీం మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్ట్‌
*ఈడీ కార్యాల‌యం ఎదుట ఎన్సీపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌

దావూద్ ఇబ్రహీం, అండర్​వరల్డ్​ డాన్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి , ఎన్‌సిపి నేత నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆయనను ఏడు గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అనంతరం అరెస్టుపై ప్రకటన చేశారు. విచారణకు నవాబ్​ మాలిక్​ సహకరించటం లేదని.. అందుకే అరెస్ట్​ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈడీ నవాబ్ మాలిక్‌ను ప్రశ్నించింది. అరెస్టు తర్వాత, నవాబ్ మాలిక్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా “లదేంగే ఔర్ జీతేంగే (పోరాడి గెలుస్తాను)” అని మంత్రి అన్నారు.

అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్​ సోదరుడు ఇబ్రహిం కస్కర్​తో సహా పలు అనుమానిత నిందితులతో సంబంధాలపై ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. దావూద్​, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్​ మాలిక్​ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి.

దీంతో దావూద్​కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రహిం కస్కర్​ను అరెస్ట్​ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్​ మాలిక్​కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

నవాబ్​ మాలిక్​ను అరెస్ట్​ నేపథ్యంలో ముంబయిలోని ఈడీ కార్యాలయం ఎదుట ఎన్​సీపీ కార్యకర్తలు అరెస్ట్​కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

Related posts