telugu navyamedia
సినిమా వార్తలు

‘సర్కారు వారి పాట’ నుంచి కళావతి పాటకు తమన్​ స్టెప్పులు

సూపర్​ స్టార్​ మహేశ్​బాబు హీరోగా కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించిన సినిమా’సర్కారు వారి పాట’ . పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన‌ సినిమా మే 12న సినిమా విడుదలకానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పొస్ట‌ర్స్ వీప‌రితీంగా ఆక‌ట్టుకున్నాయి.

Sarkaru Vaari Paata:'Kalaavathi' song promo amplifies the buzz | Telugu  Movie News - Times of India

అంతేకాదు ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్​ లిరికల్​ ‘కళావతి సాంగ్’​ ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్​లోనూ ట్రెండింగ్​లో దూసుకుపోతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ లిరికల్​ అత్యధిక వ్యూస్​తో దుమ్ములేపుతోంది. ఎక్కడ చూసిన ఈ పాటే వినపడుతుంది.

Sarkaru Vaari Paata: Mahesh Babu Is A Superstar Playing With A Young  Heroine Abroad

దీంతో కీర్తి సురేష్​, మహేశ్​ బాబు కుమార్తె సితార సైతం ఈ సాంగ్​పై స్టెప్పులేసి అలరించారు. నెటిజన్లే చాలా మంది ఈ సాంగ్‌కు రీల్స్​ చేస్తూ సోషల్​మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ పాటను కంపోజ్​ చేసిన​ సంగీత దర్శకుడు తమన్​పైనా మహేశ్​ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కళావతి పాటలో మహేశ్ బాబు వేసిన హుక్​ స్టెప్​ను శేఖర్​ మాస్టర్​తో కలిసి డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. తమన్​. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో పోస్ట్​ చేయగా ప్రస్తుతం తెగ వైరల్​గా మారింది. తమన్​ డ్యాన్స్​ స్టెప్పులపై విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ చేస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts