telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ తో దీపికా.. నిజమేనా…?

Deepika-Padukone

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబో. వీరి కాంబోలో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. జక్కన్నతో సినిమా చేసేందుకు మహేష్ కూడా రెడీ అనడంతో వారి కాంబోలో కచ్చితంగా సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ ఈ సినిమాపై ఇప్పటి వరకు సరైన అప్‌డేట్ రాలేదు. ఈ క్రమంలో అనేక రూమర్లు వెలుగు చూశాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకోణెను తీసుకోవాలని చూస్తున్నారట… అయితే భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా అడవి ప్రాధాన్యంలో తెరకెక్కనున్న యాక్షన్ అడ్వెంచర్‌ అని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా లొకేషన్ కోసం ఆఫ్రికన్ అడవులను సెలక్ట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబోలో సినిమా, అంతేకాకుండా మహేష్ హీరోగా అడ్వేంచర్ సినిమా అంటే కచ్చితంగా డబుల్ ధమాకా అని అంటున్నారు. ఈ సినిమా బాక్సఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది.

Related posts