telugu navyamedia
క్రీడలు వార్తలు

అమీర్‌ బ్లాక్ మెయిల్‌ చేస్తున్నాడు : కనేరియా

అంతర్జాతీయ క్రికెట్‌కి గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు. దాంతో పాక్ మాజీ క్రికెటర్లు అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కనేరియా స్పందించాడు. పాక్ వివాదాస్పద స్పిన్నర్ డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘నేను మహ్మద్ అమీర్‌ని తప్పుబట్టడం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ వాళ్ల అభిప్రాయాన్ని చెప్పొచ్చు. అమీర్‌ తన స్టేట్‌మెంట్స్ ద్వారా ఇతరుల్ని బ్లాక్ మెయిల్‌ చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది. తద్వారా మళ్లీ పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం అతని ఆలోచన కావొచ్చు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కి వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ని తీసుకుని ఐపీఎల్‌లో ఆడతానని చెప్తున్నాడు. దీనిబట్టి అతని ఆలోచన తీరుని మీరు అర్థం చేసుకోవచ్చు’ అని అన్నాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్‌లో ఆడాడు. పంజాబ్ కింగ్స్ తరఫున గతంలో అతడు మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలర్లకి.. మరీ ముఖ్యంగా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లకి మంచి డిమాండ్ ఉంది. మహ్మద్ అమీర్‌ ఎడమచేతి వాటం పేసర్ కాబట్టి మంచి ధర పలికే అవకాశం కూడా ఎక్కువే.

Related posts