telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజు

ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా రిటైర్డ్‌ జడ్జి కనకరాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఏపీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనకరాజ్‌ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో ఎస్‌ఈసీ గా కనగరాజును  ప్రభుత్వం నియమించింది. ఈయన మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కనగరాజు వ్యవహరించారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో ప్రభుత్వం ప్రచురించింది. శనివారం ఉదయం ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి స్థాయి అధికారిని నియమించడం, కాలపరిమితి మూడేళ్లకు కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటివరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌లకు అప్పగిస్తున్న ఆ పదవిలో.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలను నియమించేలా ఏపీ సర్కార్ మరో మార్పు తీసుకొచ్చింది.

Related posts