గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు సన్నిబియ్యంతో అన్నం పెడుతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ లో 4.20 కోట్ల రూపాయలతో నిర్మించిన గిరిజన గురుకుల విద్యాలయం ప్రారంభోత్సవంలో సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రెసిడెన్షియల్ విద్యాలయాల్లో నేడు ఒక్కో విద్యార్థిపై లక్షా 20వేల రూపాయలను ఖర్చు చేస్తున్న ఏకైక కేసీఆర్ అని అన్నారు.
విద్య ద్వారానే అట్టడుగున ఉన్న గిరిజనులు అభివృద్ధి చెందుతారని నమ్మి, ఈరోజు పెద్ద ఎత్తున గిరిజన గురుకులాలు తీసుకొస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికి ఎక్కువగా పాటుపడుతున్నారన్నారు. గత 70 ఏళ్లలో ఎన్ని గురుకులాలు నిర్మించారో, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గురుకులాలను నిర్మించాలని చెప్పారు.
జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: విడదల రజని