కరోనాపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందేనన్నారు. కరోనా నివారణ చర్యలపై కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. కోవిడ్‌పట్ల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.85 శాతం ఇంట్లోనే ఉండి మందులను తీసుకుంటే సరిపోతుందన్నారు. ఇళ్లలో ప్రత్యేక గది లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చన్నారు.
కోవిడ్ వచ్చిందన్న అనుమానం రాగానే ఏం చేయాలన్న దానిపై అవగాహన ఉండాలని తెలిపారు. ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలన్నదానిపై అవగాహన కల్పించాలి. కోవిడ్ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయన్నదానిపై అవగాహన కలిగించాలి. 85 శాతం మంది ఇంట్లోనే ఉండి మందులను తీసుకుంటే తగ్గిపోతుంది. అంతర్జాతీయ విమానాలు, సరిహద్దుల్లో రాకపోకల వల్ల కేసులు పెరుగుతాయన్నారు.