telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

విశాఖ గ్యాస్ లీకేజీ కేసులో 12 మందికి 14 రోజుల రిమాండ్

LG-Polymers- vizag

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విశాఖ లీకేజీ ఘటనలో 12 మందిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని ఈరోజు రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. వీరందరికీ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వీరిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇందులో ఎల్జీ పాలిమర్స్ సీఈవో, డైరెక్టర్లు కూడా ఉన్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందగా, 585 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ లీకేజీ ఘటనపై నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్ కు 350 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అరెస్టులు జరిగాయి. అంతేకాదు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇద్దరు అధికారులపై వేటు వేశారు.

Related posts