telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పంచాయితీలన్నీ ఏకగ్రీవం అయితే బాగుంటుంది : పెద్దిరెడ్డి

Peddireddy

ఏపీలో ఇప్పుడు రాజకీయాలు మొత్తం పంచాయితీ ఎన్నికల చూట్టే నడుస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు సిద్ధం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంచాయితీలన్నీ ఏకగ్రీవం అయితే శాంతియుత వాతావరణం నెలకొంటుందని అన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో జీఓ-36/2020 ఇవ్వడం జరిగిందని అన్నారు. గతంలో పంచాస్ అని ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసేవారని కానీ గ్రామ‌ సచివాలయాలు, వార్డు సచివాలయాలు తీసుకొచ్చామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పంచాయితీలను ఏర్పాటు చేయాలన్న ఆయన గుజరాత్, హర్యాణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ లలో ఏకగ్రీవ ఎన్నికలే జరిగాయని అన్నారు. అక్కడ కూడా పంచాయితీలకు ఇన్సెంటివ్స్ ఇచ్చారని, ఏకగ్రీవం అయిన పంచాయితీలకు ఇక్కడ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని అన్నారు. ఎస్ఈసీ ఒక పార్టీకి కాన్స్పిరేటర్ గా పనిచేస్తున్నారన్న ఆయన ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాలు ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు. ఏకగ్రీవం పై ఒక ఐజీ స్ధాయి అధికారిని పెట్టడం కూడా ఎస్ఈసీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts