telugu navyamedia
సినిమా వార్తలు

‘అహింస’ తో ఎంట్రీ ఇస్తున్న దగ్గుబాటి హీరో..

దగ్గుబాటి కుటుంబం నుంచి మ‌రో హీరో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు, నటుడు రానా సోదరుడు అభిరామ్‌ దగ్గుబాటి వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

ఎంతో మంది టాలెంటెట్ యాక్టర్స్ ని ప్రముఖ దర్శకుడు తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తేజ దర్శకత్వంలో అభిరామ్‌ ఓ సినిమా చేస్తున్నారు. మంగళవారం తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు, ప్రీలుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘అహింస’ అనే పేరు పెట్టారు. ‘అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తధైవచ’ అంటూ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రీలుక్‌ను విడుదల చేసింది.

ముఖానికి గోనె సంచి కట్టి ఉండగా, రక్తమోడుతూ అభిరామ్‌ కనిపించాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘అహింస’కి ఆర్పీ పట్నాయక్‌ సంగీత దర్శకుడు.

Related posts