telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు : సీబీఐ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదు

*వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్..

*క‌డ‌ప రిమ్స్ పీఎస్‌లో సీబీఐ ఎఎస్‌పి రామ్‌సింగ్‌పై కేసు
*క‌డ‌ప ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉద‌య్‌కుమార్ రెడ్డి..

మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి కీల‌క మలుపులు తీరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదైంది. రామ్‌సింగ్‌పై తనను బెదిరిస్తున్నారంటూ ఉదయ్ కుమార్ రెడ్డి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివేకా హత్య కేసులో తాము చెప్పినట్లు చెప్పాలని రాంసింగ్ ఒత్తిడి చేశారని ఉదయ్ ఆరోపించాడు. దీంతో రాంసింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే వైఎస్ హత్య కేసు పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ అధికారుల అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.

ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిలు అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరిగే విధంగా ఆదేశించారు. పులివెందుల కోర్టుకు హాజరైన నలుగురు నిందితులకు సీబీఐ అభియోగ పత్రాల వివరాలను మెజిస్ట్రేట్ తెలియజేశారు.

Related posts