టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఆయన అభిమానులు నిరుత్సాహపడిన మాట వాస్తవమే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అయినా మహీ ఆటను చూడొచ్చని ఆయన అభిమానులు ముచ్చటపడ్డారు. అయితే మహీకి ఐపీఎల్ 2021 చివరి సీజన్ కావచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం ధోనీకి ఇదే చివరి సీజన్ కాదని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ను ‘ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ కానుందా?. భవిష్యత్తులో చెన్నైని ముందుకు నడిపించే సారథిపై ఏమైనా ప్రణాళిక సిద్ధంగా ఉందా?’ అని అడగ్గా… ‘మహీకి ఇదే చివరి ఏడాది అని నాకు అనిపించడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము ఇప్పటికిప్పుడు మరో ప్లేయర్ వైపైతే చూడటం లేదు. ఇప్పటివరకు ధోనీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని చెన్నై సీఈవో స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 మొదటి మ్యాచ్ లో ముంబై-బెంగళూరు తలపడనున్నాయి.
previous post
next post