నేడు ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్న వేళ..కోహ్లీ సేన విజయాన్ని కాంక్షిస్తూ క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. వారణాసిలో భారత క్రికెట్ జట్టు అభిమానులు ఆస్ట్రేలియాపై విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఈ రోజు కెనింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల్లో గెలవగా.. భారత్ ఆడిన ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది.