telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు 152 చిత్రం షూటింగ్ ప్రారంభం

Chiranjeevi

చిరు 152వ చిత్రం నేటి నుండి కోకాపేట‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో చిత్ర షూటింగ్ జ‌రుపుకుంటుంది. తొలి షెడ్యూల్‌లో మాస్ సాంగ్ తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం సోషియో థీమ్‌తో తెర‌కెక్కనుంద‌ని తెలుస్తుండ‌గా, ఎండోమెంట్స్ విభాగం మరియు దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్ర‌భావం చూపుతాయి అనేది ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నార‌ట‌ని టాక్. ఇక చిరు పాత్ర దేవాదయ, ధర్మా దయ శాఖలో పనిచేసే ఉద్యోగి అని స‌మాచారం . అంతేకాదు ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై అతను ఎలా చర్యలు తీసుకుంటాడు అనేది ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితం మణిశర్మ, కొరటాల శివ థాయిలాండ్ వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. సినిమాకి మంచి ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారు. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ 14న సినిమాని రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట మేక‌ర్స్‌.

Related posts