telugu navyamedia
రాజకీయ వార్తలు

పశ్చిమ బెంగాల్ లో 12.8 శాతం కరోనా మరణాలు!

mamatha benerji

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్‌లోనే మరణాల రేటు ఎక్కువగా ఉందని కేంద్ర బృందం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో అంతర మంత్రిత్వశాఖల కేంద్రం బృందం తెలిపింది.

దేశంలోనే అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 12.8 శాతం మరణాలు సంభవిస్తున్నాయని ఆ లేఖలో కేంద్ర బృందం నేత అపూర్వ చంద్ర పేర్కొన్నారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ జగ్‌దీప్ దన్‌ఖర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మమత పోలీసు పాలన సాగిస్తున్నారని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలని గవర్నర్ హితవు పలికారు.

Related posts